అధికారుల నిర్లక్ష్యం.. నాలుగు నెలలు గడుస్తున్నా పాత బోర్డే

by srinivas |   ( Updated:2021-12-13 08:20:38.0  )
అధికారుల నిర్లక్ష్యం.. నాలుగు నెలలు గడుస్తున్నా పాత బోర్డే
X

దిశ, ఏపీ బ్యూరో: తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండల పరిషత్ కార్యాలయంలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. మండల పరిషత్ నూతన కార్యవర్గం ఎన్నికై నాలుగు మాసాలు గడుస్తున్నా ఇప్పటికీ పాతబోర్డే దర్శనమిస్తుంది. ఎంపీటీసీ సభ్యుల వివరాలు సైతం గత కార్యవర్గానికి సంబంధించినవి కావడంతో ప్రజా ప్రతినిధులు మండిపడుతున్నారు. కొత్త పాలకవర్గం ఏర్పడి నాలుగు నెలలు గడుస్తున్నా కనీసం బోర్డుపై వారి వివరాలు కూడా పొందపరచలేని స్థితిలో మండల పరిషత్ కార్యాలయం ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఉన్న బోర్డుపై పాలక వర్గంలోని పాత ఎంపీటీసీల పేర్లు తొలగించి కొత్తగా ఎన్నికైన ఎంపీటీసీల పేర్లు పొందుపరచాలని ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. అంతేకాదు అధికారులు ప్రవర్తిస్తున్న తీరుపై కూడా స్థానిక ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



Next Story

Most Viewed