భాగస్వామ్యం అవసరం : గజేంద్ర షెకావత్

by  |
భాగస్వామ్యం అవసరం : గజేంద్ర షెకావత్
X

దిశ, వెబ్‌డెస్క్: రాజస్థాన్‌లో సగటున ఒక మహిళ తన జీవితకాలంలో 2 లక్షల కిలోమీటర్లు నడిచి కుటుంబానికి అవసరమైన నీటిని తెస్తోందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ చెప్పారు. సోమవారం జరిగిన ఎఫ్ఎల్‌వో(ఫిక్కీ మహిళా ఆర్గనైజేషన్) మహిళా సభ్యుల వర్చువల్ సమావేశంలో ఆయన ప్రసంగించారు. కుటుంబానికి, వ్యవసాయానికి అవసరమైన నీటిని అందించేందుకు మహిళలు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని లెక్కచేకుండా శ్రమిస్తున్నారని తెలిపారు. అయినప్పటికీ, ఆమెకు నీటి నిర్వహణ, పంపిణీ విషయంలో ఆమె అభిప్రాయాన్ని గౌరవించడంలేదన్నారు.

భారత నీటి విధానంపై ఫిక్కి మహిళల ఆర్గనైజేషన్ నిర్వహించిన రౌండ్ టేబుల్ చర్చలో ఆయన పాల్గొన్నారు. జల్ జీవన్ మిషన్ కోసం ప్రభుత్వం రూ. 3.5 లక్షల కోట్ల ఖర్చు చేస్తున్నట్టు, ఇది ప్రతిష్టాత్మక లక్ష్యమని, దీనికి ప్రజల భాగస్వామ్యం అవసరమని ఈ సందర్భంగా ఆయన కోరారు. 2024 నాటికి ప్రతి గ్రామీణ గృహాలకు పైపుల ద్వారా తాగునీటిని పొందే లక్ష్యాన్ని సాధించేందుకు ముందుకు రావాలని సమావేశంలో పాల్గొన్న మహిళలకు ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే, వివిధ సంస్థలు, కార్పొరేట్లు, ఇంకా ఇతర మార్గాల ద్వారా విరాళం సమీకరించేందుకు ఎఫ్ఎల్‌వోను ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మాట్లాడిన ఫిక్కీ, ఎఫ్ఎల్‌వో ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ జహ్నాబీఫుకాన్…నీరు మన పర్యావరణం, ఆర్థికవ్యవస్థ, సమాజంపై అధిక ప్రభావం చూపుతుందన్నారు.

Next Story