ఆలా ఇళ్లను కొనేవారు తగ్గిపోయారు : అనరాక్

by  |
house
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కొత్తగా సొంత ఇంటిని కావాలనుకునేవారిలో చాలామంది పూర్తి కావాడానికి సిద్ధంగా ఉన్న వాటిని కొనేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని ఓ నివేదిక వెల్లడించింది. ప్రముఖ స్థిరాస్థి సలహా సంస్థ అనరాక్, పరిశ్రమల సంఘం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ) సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో 80 శాతం మంది పూర్తవడానికి సిద్ధంగా ఉన్న ఇంటిని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు స్పష్టం చేశారు. మిగిలిన 20 శాతం మంది మాత్రమే కొత్త ప్రారంభించిన ఫ్లాట్‌లను కొనాలనుకుంటున్నట్టు తేలింది. మొట్టమొదటిసారిగా సరసమైన ధరలో ఇళ్లను కావాలనుకునే చాలావరకు తగ్గిపోయారని ఈ నివేదికలో తేలింది. అలాగే, ఇంటిని కొనడానికి ముందు ప్రాజెక్ట్ డిజైన్, డెవలపర్ సంస్థ విశ్వసనీయత, ఇళ్లు ఉన్న ప్రాంతం వంటి అంశాలను కొనుగోలుదారులు ప్రధానంగా చూస్తున్నారని నివేదిక పేర్కొంది.

సీఐఐ, అనరాక్ సేకరించిన వివరాల ప్రకారం.. రెడీ-టూ-మూవ్-ఇన్(పూర్తయిన) వాటిని కొనడానికి 32 శాతం మాత్రమే ఆసక్తి చూపిస్తున్నారు. సుమారు 24 శాతం మంది ఆరు నెలల్లో పూర్తయ్యే వాటిని కొనడానికి సిద్ధంగా ఉన్నారు. 23 శాతం మంది ఏడాదిలోగా పూర్తయ్యే ఇంటికోసం కొనే ఆసక్తి లేదని చెబుతున్నారు. కొవిడ్ మహమ్మారి పరిస్థితులు సొంత ఇళ్లు ఉండాలనుకునే ప్రాధాన్యతలను మార్చేశాయి. సెకెండ్ వేవ్ పరిణామాలతో ఇది మరింత మార్పులకు లోనైందని అనరాక్ సంస్థ అభిప్రాయపడింది. 34 శాతం మంది రూ. 90 లక్షల నుంచి రూ. 2.5 కోట్ల మధ్య ఇళ్ల కోసం చూస్తున్నారని అనరాక్ వెల్లడించింది. 35 శాతం మంది రూ. 45-90 లక్షల మధ్య కావాలనుకుంటున్నారు. కేవలం 27 శాతం మంది మాత్రమే రూ. 45 లక్షల్లోపు ఇళ్ల కోసం చూస్తున్నారు.



Next Story

Most Viewed