కాల్పుల భయంలో స్టార్ యాక్టర్.. టెన్షన్‌గా ఉందంటూ వీడియో పోస్ట్ 

by  |
Nawazuddin Siddiqui
X

దిశ, సినిమా: బాలీవుడ్ ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ కనిపించిన ‘స్క్విడ్ గేమ్’ సంబంధిత వీడియో ఒకటి వైరల్ అవుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో పాపులరైన ఈ కొరియన్ సిరీస్‌లో తను నటించలేదు. కానీ స్క్విడ్ గేమ్‌లోని ‘డాల్గోనా మిఠాయి గేమ్’ సీన్‌లో తాను పార్టిసిపేట్ చేసినట్లు డిజిటల్‌‌గా‌ డిజైన్ చేసిన వీడియోను తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో ప్లేగ్రౌండ్ మాదిరిగా రూపొందించిన ఓ గదిలో కూర్చుని మిఠాయి నాకుతూ కనిపించిన సిద్దిఖీ.. ‘ఈ వ్యక్తులు నాతో ఎందుకు ఆటలు ఆడుతున్నారు. వారికి ఏం కావాలి?’ అనే క్యాప్షన్ జోడించాడు. ఇక మిఠాయి తింటున్న టాస్క్‌లో భాగంగా కొంతమంది కంటెస్టెంట్లను గార్డులు కాల్చివేస్తుంటే.. నవాజ్ భయంతో వణుకుతున్నట్లుగా కనిపించాడు. ఆ తర్వాత నవాజ్ మిఠాయి కరగకపోవడంతో తన దగ్గరకు ఓ గార్డు గన్ను పట్టుకుని వచ్చినట్లు క్రియేట్ చేసిన నటుడు.. ‘నేను ఇది కాకుండా వేరే ఏదైనా రుచిని పొందగలనా? కేసర్ పిస్తా, కాలా ఖట్టా, ఇంకేదైనా?’ అని అమాయకంగా అడగడం నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది.


Next Story

Most Viewed