ఇంద్రకీలాద్రిపై ముగిసిన నవరాత్రి మహోత్సవాలు

by  |
ఇంద్రకీలాద్రిపై ముగిసిన నవరాత్రి మహోత్సవాలు
X

దిశ, ఏపీ బ్యూరో: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రులు ముగిశాయి. పూర్ణాహుతితో దసరా ఉత్సవాలు ముగిశాయి. ఈ పూర్ణాహుతి కార్యక్రమంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్, చైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో బ్రమరాంబలు పాల్గొన్నారు. దసరా ఉత్సవాలను ఘనంగా‌ నిర్వహించామని, అన్ని శాఖల సమన్వయంతో ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించామని, ఇందుకు సహకరించిన ప్రతీ ఒక్కరికి దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్ ధన్యవాదాలు తెలిపారు. దసరా ఉత్సవాల్లో లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ ఈవో భ్రమరాంబ అన్నారు. కృష్ణా నదిలో నదీ ప్రవాహం వల్ల దుర్గమ్మ నదీ విహారం లేదని తెలిపారు. హంసవాహనంపై ఆది దంపతులకు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మరో రెండు రోజుల పాటు భవానీల రద్దీ కొనసాగే అవకాశం కనిపిస్తోంది.


Next Story

Most Viewed