'మీకు రిజర్వేషన్‌లో జాబ్ వచ్చిందా..?' : కేసు విచారణలో పాట్నా జడ్జి షాకింగ్ కామెంట్స్

by Disha Web Desk 13 |
మీకు రిజర్వేషన్‌లో జాబ్ వచ్చిందా..? : కేసు విచారణలో పాట్నా జడ్జి షాకింగ్ కామెంట్స్
X

పాట్నా: బీహార్ పాట్నా హైకోర్టు జడ్జి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. కేసు విచారణలో భాగంగా ఆయన రిజర్వేషన్లను తక్కువ చేసి మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో జిల్లా భూసేకరణ అధికారి అరవింద్ కుమార్ భర్తీ‌కు సంబంధించిన కేసు విచారణ జరగుతుంది. విభజన పిటిషన్ పెండింగ్‌లో ఉండగా ఒక పార్టీకి భూసేకరణ పరిహారం ఎలా విడుదల చేశారో వివరించేందుకు హాజరు కావాలని కోర్టు అధికారిని కోరింది. ఆ తర్వాత కేసును వాయిదా వేస్తూ.. అధికారిని ఉద్దేశించి రిజర్వేషన్‌లో మీకు ఉద్యోగం వచ్చిందా అని జస్టిస్ ప్రశ్నించారు. దానికి అరవింద్ అవుననే సమాధానమిచ్చి, అక్కడి నుంచి వెళ్లిపోయారు. అ తర్వాత కోర్టు రూంలోని లాయర్లు నవ్వారు. దీనికి సంబంధించిన వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉన్నత స్థానంలోని జడ్జి అధికారి పట్ల ప్రవర్తన పై విమర్శలు వెల్లువెత్తాయి.


Next Story

Most Viewed