చీర కోసం షాపింగ్ మాల్‌లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు (వీడియో)

by Disha Web Desk 6 |
చీర కోసం షాపింగ్ మాల్‌లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: మహిళలకు చీరలు, ఆభరణాలు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే షాపింగ్ మాల్స్‌కు వెళ్లి తమకు ఇష్టమైన వాటిని కొనుగోలు చేస్తారు. అదే వారికి నచ్చింది ఇతరులు తీసుకుంటే మాత్రం ఆగ్రహంతో ఊగిపోతూ ఏం చేయడానికైనా సిద్ధపడుతుంటారు. ఇలాంటి ఘటనే బెంగళూరులో చోటుచేసుకుంది. బెంగళూరులోని మల్లేశ్వరంలో ఓ షాపింగ్ మాల్‌లో సిల్క్ చీర వార్షిక విక్రయం నిర్వహించారు. దీంతో చీరలు కొనుగోలు చేసేందుకు మహిళలు భారీగా తరలివచ్చారు. ఈ నేపథ్యంలో ఇద్దరు మహిళలకు ఒకే చీర కోసం గొడవ పడ్డారు. అంతేకాకుండా జుట్టు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్నారు. దీంతో అది చూసిన వారు వారిని అదుపులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story

Most Viewed