రూ.3.39 లక్షల కోట్లతో బెంగాల్ బడ్జెట్

by Dishafeatures2 |
రూ.3.39 లక్షల కోట్లతో బెంగాల్ బడ్జెట్
X

కోల్‌కతా: రైతులు, తేయాకు రంగానికి ప్రాధాన్యత కల్పిస్తూ మమతా బెనర్జీ ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు చేసింది. 2023-24కు గానూ బుధవారం రూ.3.39 లక్షల కోట్ల బడ్జెట్‌ను టీఎంసీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర జీడీపీ 8.4 శాతం కాగా పరిశ్రమ వృద్ధి రేటు 7.8 శాతంగా అంచనా వేసినట్లు ఆర్థిక మంత్రి చంద్రిమా భట్టాచార్య తెలిపారు. అయితే ఈ రెండూ దేశం ఆశించిన వృద్ధి రేటు కంటే ఎక్కువని చెప్పారు.

రాబోయే పశ్చిమ బెంగాల్ లాజిస్టిక్స్ పాలసీ 2023 గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్‌ను రూపొందించడానికి దక్షిణాసియా, ఆసియన్ దేశాల దిశలో రాష్ట్ర వ్యూహాత్మక స్థానాన్ని ప్రభావితం చేస్తుందని ఆమె అన్నారు. తాజా బడ్జెట్ అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉందని మమతా బెనర్జీ అన్నారు. మరోవైపు సీఎం వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ సభ నుంచి వాకౌట్ చేసింది.


Next Story