అల్లర్లపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

by Mahesh |
అల్లర్లపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్ రాష్ట్రంలో తలపెట్టిన నిరసనలు హింసాకాండకు దారి తీసిన విషయం తెలిసిందే. హింసకు సంబంధించిన వీడియోలు మీడియాలో రావడంతో సుమోటో కేసుగా తీసుకున్న కలకత్తా హైకోర్టు (Calcutta High Court..).. పరిస్థితులను చక్కబెట్టేందుకు కేంద్ర బలగాలు రంగంలోకి దిగాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఐదు కేంద్ర బలగాలకు హింస జరిగిన ప్రాంతాలకు చేరుకుని అల్లర్లును అదుపు చేశారు. ఈ అల్లర్లతో బెంగాల్ ప్రభుత్వం (Government of Bengal)పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ రోజు కలకత్తలోని ఓ మైదానంలో ముస్లిం సంఘాల నేతలతో సీఎం మమతా బెనర్జీ (CM Mamata Banerjee) సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. "ఎంత మంది యువతకు ఉద్యోగాలు వచ్చాయో వారు (కేంద్రం) సమాధానం చెప్పాలి? మందులు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని మండిపడ్డారు. అలాగే బెంగాల్ రాష్ట్రం గురించి కొన్ని మీడియా సంస్థలు బెంగాల్‌కు వ్యతిరేకంగా మాత్రమే మాట్లాడుతున్నాయని ఆరోపించారు. బీజేపీ నిధులు సమకూర్చిన కొన్ని మీడియా ఛానెల్‌లు (Media channels) బెంగాల్‌తో సంబందం లేని నకిలీ వీడియోలను చూపిస్తున్నారు. అలాంటి వారిని మేము పట్టుకున్నాం. వారు కర్ణాటక, యుపీ, బీహార్, రాజస్థాన్ నుండి 8 వీడియోలను చూపించి బెంగాల్‌ను అపఖ్యాతి పాలయ్యేలా ప్రయత్నించారని సీఎం మమతా బెనర్జీ ఫైర్ అయ్యారు.

అలాగే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ (Union Home Ministry) ప్రకటనపై స్పందిస్తూ.. ముర్షిదాబాద్ హింస (Murshidabad violence)లో బంగ్లాదేశీయుల ప్రమేయం ఉందని హోం మంత్రిత్వ శాఖ ఆరోపిస్తుంది. ఇది నిజమైతే, కేంద్ర ప్రభుత్వమే దీనికి బాధ్యత వహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కాదు. సరిహద్దును BSF చూసుకుంటుంది. ప్రజలు బయటి నుంచి వచ్చి, అల్లకల్లోలం సృష్టించి, పారిపోవడానికి మీరు ఎందుకు అనుమతించారు?" అని కేంద్రంపై మమతా ప్రశ్నల వర్షం కురిపించారు.

Next Story

Most Viewed