ఉగ్రవాదాన్ని సహించేది లేదు.. ర్యాలీలో అమిత్ షా హాట్ కామెంట్స్..

by Disha Web Desk 14 |
ఉగ్రవాదాన్ని సహించేది లేదు.. ర్యాలీలో అమిత్ షా హాట్ కామెంట్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: పాక్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా షాకిచ్చారు. ఎటువంటి ఉగ్రవాద చర్యలను సహించేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా జమ్ము కాశ్మీర్‌ను దేశంలోనే అంత్యంత శాంతి వంతమై రాష్ట్రంగా మారుస్తామని తెలిపారు. అయితే పాకిస్తాన్ అధికారులతో ఎటువంటి చర్చలు చేసే ప్రసక్తే లేదని అమిత్ షా బుధవారం ప్రకటించారు. అయితే జమ్ము కాశ్మీర్‌లో నిర్వహించిన ర్యాలీలో అమిత్ షా మాట్లాడుతూ.. ఎప్పుడైనా ఎవరికైనా ఉగ్రవాదం మంచి చేసిందా అని ప్రశ్నించారు. 1990 నుంచి ఇప్పటి వరకు కాశ్మీర్‌లో ఉగ్రవాదం 42 వేల ప్రాణాలను బలి తీసుకుందని అన్నారు.

1947 స్వాతంత్ర్యం తర్వాత కాశ్మీర్‌ను పరిపాలించిన నేషనల్ కాన్ఫరెన్స్ అబ్దుల్లా, ముస్తిఫ్ (పీడీపీ), నెహ్రూ గాంధీ (కాంగ్రెస్)లను కాశ్వీర్ అభివృద్ధి కాకపోవడంపై ఆయన నిందించారు. 'పాకిస్తాన్‌తో చర్చించాలని కొందరు అంటుంటారు. పాక్‌తో మనం ఎందుకు చర్చించాలి? మేము మాట్లాడం. మేము బరముల్లా ప్రజలతో, కాశ్మీర్ ప్రజలతో మాట్లాడుతాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉగ్రావాదాన్ని ఏమాత్రం సహించదు. త్వరలోనే జమ్ము కాశ్మీర్‌లో ఉగ్రవాద్ది సమూలంగా తుడిచేస్తాం. అంతేకాకుండా దేశంలోనే అత్యంత శాంతియుతమై ప్రదేశంగా జమ్మూ కాశ్మీర్‌ను తయారు చేస్తాం' అని అమిత్ షా అన్నారు.

Next Story