మిగ్-21 యుద్ధ విమానాలకు సెలవు..

by Vinod kumar |
మిగ్-21 యుద్ధ విమానాలకు సెలవు..
X

న్యూఢిల్లీ: కాలం చెల్లిన MiG-21 స్క్వాడ్రన్‌లను LCA మార్క్ 1Aతో రీప్లేస్ చేసేందుకు భారత వైమానిక దళం (IAF) సిద్ధంగా ఉందని ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి మంగళవారం తెలిపారు. రష్యాకు చెందిన ఈ యుద్ధ విమానాలను అన్నింటినీ 2025 నాటికి భర్తీ చేస్తామని వెల్లడించారు. అక్టోబర్ 8న ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించనున్న వైమానిక దళ దినోత్సవానికి ముందు ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా MIG 21 గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇచ్చిన ఎయిర్ చీఫ్ మార్షల్.. ‘83 LCA మార్క్-1As కోసం ఒప్పందంపై సంతకం చేశాం.

ఈ ఒప్పందం 97 అదనపు విమానాలతో భర్తీ చేయబడుతుంది. దీంతో మొత్తం LCA మార్క్ 1Aల సంఖ్య 180కి చేరుకుంటుంది’ అని పేర్కొన్నారు. ‘2025 నాటికి MiG-21 యుద్ధ విమానాలను నడపడం ఆపేసి.. వాటిని LCA మార్క్-1Aతో భర్తీ చేసే ప్రతిపాదన అమలులో ఉందని చౌదరి చెప్పుకొచ్చారు. మరో నెలరోజుల్లోగా రెండో స్క్వాడ్రన్ నంబర్-ప్లేట్ సిద్ధమవుతుందని.. మూడోది వచ్చే ఏడాదిలో ఎప్పుడైనా రావచ్చని తెలిపారు. కాగా భారత వైమానిక దళంలో 60 ఏళ్లకు పైగా సేవలందిస్తున్న MiG-21 ఇటీవలి కాలంలో అనేక ప్రమాదాలను ఎదుర్కొంది.

Next Story