భోపాల్ దుర్ఘటన బాధితులకు నివాళులర్పించిన శివరాజ్ సింగ్ చౌహాన్

by Disha Web Desk 10 |
భోపాల్ దుర్ఘటన బాధితులకు నివాళులర్పించిన శివరాజ్ సింగ్ చౌహాన్
X

గ్వాలియర్: ప్రపంచంలోనే భారీ పారిశ్రామిక దుర్ఘటనగా పేరొందిన భోపాల్ గ్యాస్ ఘటనకు 39 ఏళ్లు పూర్తయ్యాయి. ఇప్పటికీ ఆ విషవాయువుల ప్రభావాలను ప్రజలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ప్రభుత్వాలు అందించిన సాయం పెద్దగా ఫలించలేదు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ విషపూరిత వ్యర్థాలను కాల్చడం సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దుర్ఘటన బాధితులకు నివాళులర్పించారు. భోపాల్ గ్యాస్ దుర్ఘటన మృతులకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం చౌహాన్ మాట్లాడుతూ, '1984 డిసెంబర్ 2,3 తేదీల్లో జరిగిన దారుణం ఇప్పటికీ ఓ పీడకలగానే ఉంది. ఇలాంటి విషాదం ఎన్నటికీ పునరావృతం అవకూడదు. అందుకోసం అభివృద్ధితో పాటు పర్యావరణాన్ని సమతుల్యం అవసరం. ఈ దుర్ఘటనలో బాధితులకు నివాళులు అర్పిస్తున్నానని' ఆయన పేర్కొన్నారు. కాగా, మధ్యప్రదేశ్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీజేపీ అనుకూల ఆధిక్యాన్ని సాధించడం పట్ల శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించడానికి నిరాకరించారు. 'ఈ విషయాలపై (ఎన్నికల ఫలితాలు) మాట్లాడటానికి ఇది సమయం కాదు' అని అన్నారు, రాష్ట్రంలో పార్టీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.Next Story