పార్లమెంట్ అంతరాయాలపై ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు..

by Disha Web Desk 13 |
పార్లమెంట్ అంతరాయాలపై ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు..
X

బెంగళూరు: పార్లమెంట్ సమావేశాల్లో అంతరాయాలను వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాలని కోరారు. ప్రజాస్వామ్యా దేవాలయంలో ఇటువంటి ప్రవర్తనలకు వ్యతిరేకంగా వాతావరణాన్ని, ప్రజల అభిప్రాయాన్ని రూపొందించడానికి ప్రజా ఉద్యమం అవసరమని అన్నారు. అయితే ఈ పిలుపు రాజకీయాల కోసం కాదని, దేశ ప్రయోజనాల కోసమేనని స్పష్టం చేశారు. బుధవారం కర్ణాటకలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ‘రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ కీలక పాత్ర పోషించాడు.

దాదాపు మూడేళ్ల చర్చ, వాదనల తర్వాత ఇది రూపుదిద్దుకుంది’ అని అన్నారు. పార్లమెంట్ అనేది ప్రభుత్వాన్ని, కార్యనిర్వాహకుడిని జవాబుదారీగా ఉంచడానికి వేదిక అని చెప్పారు. కానీ అక్కడ ఆటంకాలు, అంతరాయాన్ని ప్రజలు పట్టించుకోకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోందని ఆయన తెలిపారు. రాజ్యసభకు అంతరాయం కలిగించడం ద్వారా కోట్ల రూపాయాల ప్రజా ధనం వృథా అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండు సెషన్లలో పార్లమెంట్ సమావేశాలు విపక్షాల నిరసనలతో అంతరాయం కలిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రజాప్రతినిధుల తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తూ ధన్కడ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

Next Story

Most Viewed