Varanasi: వారణాసిలో విషాదం.. కాశీ విశ్వనాథ ఆలయ సమీపంలో కూలిన రెండు ఇళ్లు

by vinod kumar |
Varanasi: వారణాసిలో విషాదం.. కాశీ విశ్వనాథ ఆలయ సమీపంలో కూలిన రెండు ఇళ్లు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న కాశీ విశ్వనాథ ఆలయం సమీపంలో మంగళవారం ఉదయం రెండు ఇళ్లు కూలిపోయాయి.ఈ ఘటనలో ఓ మహిళ మరణించగా..మహిళా కానిస్టేబుల్‌తో సహా మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇళ్లు కూలిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్‌ఎఫ్), వైద్యులు, డాగ్ స్క్వాడ్‌తో కూడిన బృందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న 8 మందిని బయటకు తీశారు. తెల్లవారుజామున 3గంటలకు ఒక ఇళ్లు కూలిపోగా..ఆ వెంటనే దాని పక్కనున్న మరో ఇళ్లు కుప్పకూలినట్టు స్థానికులు తెలిపారు.

ప్రమాదం తర్వాత మైదాగిన్, గొదౌలియా నుంచి కాశీ విశ్వనాథ ఆలయానికి వెళ్లే రహదారిని మూసివేశారు. పలు లైన్ల నుంచి భక్తుల ప్రవేశాన్ని నిలిపివేశారు. నగరంలో భారీ వర్షం కారణంగానే ఇళ్లు కూలిపోయాయని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై సీఎం యోగీ ఆధిత్య నాథ్ స్పందించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సూచించారు.



Next Story

Most Viewed