యుద్ధం ముగించాలని పుతిన్ ని కోరే చొరవ భారత్ కు మాత్రమే ఉంది- అమెరికా

by Shamantha N |
యుద్ధం ముగించాలని పుతిన్ ని కోరే చొరవ భారత్ కు మాత్రమే ఉంది- అమెరికా
X

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా అధ్యక్షుడు పుతిన్ తో జరిపిన చర్చల్లో ప్రధాని మోడీ ఉక్రెయిన్ తో యుద్ధం గురించి ప్రస్తావించారు. కాగా.. మోడీ రష్యా పర్యటనను గమనించిన అగ్రరాజ్యం.. ఉక్రెయిన్ తో యుద్ధం గురించి మోడీ చేసిన వ్యాఖ్యలపై స్పందించింది. ఉక్రెయిన్‌తో యద్ధం ముగించాలని పుతిన్‌ను కోరే చొరవ భారత్‌కు మాత్రమే ఉందని పేర్కొంది. అందుకు ఆ రెండు దేశాల మధ్య ఉన్న బంధమే అందుకు కారణమని తెలిపింది. ఈ మేరకు ఉక్రెయిన్ తో యుద్ధానికి స్వస్తి చెప్పాలని వైట్‌హౌస్ అధికార ప్రతినిధి కరీన్ జీన్-పియర్ రష్యాకు హితవు పలికారు. ఇకపోతే, . రెండ్రోజుల క్రితం ఉక్రెయిన్‌పై రష్యా జరిపిన క్షిపణి దాడిలో పలువురు చిన్నారులు చనిపోయారు. మోడీ రష్యా పర్యటనలో ఉన్న సమయంలోనే ఈ ఘటన జరిగింది. దీని గురించి పుతిన్ దగ్గర మోడీ ప్రస్తావించారు. చిన్నారుల మరణాలు కలిచివేశాయని ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధం, ఘర్షణల వల్ల సాధారణ పౌరులు, చిన్నారులు మరణిస్తే.. అందరూ బాధఫడతారని అన్నారు. యుద్ధం వల్ల పరిష్కారం రాదని పుతిన్ కు వివరించారు. చర్చలు, దౌత్యం వల్లే రష్యా, ఉక్రెయిన్ ఘర్షణకు పరిష్కారం లభిస్తుందని గుర్తుచేశారు. కాగా, మోడీ వ్యాఖ్యలపై వైట్ హౌజ్ ఈ విధంగా స్పందించింది.

Advertisement

Next Story

Most Viewed