రిపబ్లిక్ డే వేడుకలకు చీఫ్ గెస్ట్‌గా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

by Dishafeatures2 |
రిపబ్లిక్ డే వేడుకలకు చీఫ్ గెస్ట్‌గా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రతీ ఏడాది ఒక్కో దేశానికి చెందిన అధ్యక్షుడు చీఫ్ గెస్ట్‌లుగా వస్తుంటారు. రిపబ్లిక్ డే వేడుకలకు విదేశాలకు చెందిన అధ్యక్షులను ప్రధాని ఆహ్వానిస్తూ ఉంటారు. దీంతో రిపబ్లిక్ డే వేడుకల్లో అతిధులు పాల్గొని గౌరవవందనం స్వీకరిస్తారు. కరోనా కారణంగా 2021,22లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు అతిధులెవ్వరినీ పిలపలేదు. ఈ ఏడాది జరిగిన గణతంత్ర వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతహ్ ఎల్‌సిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అయితే వచ్చే ఏడాది జరగనున్న రిపబ్లిక్ డే వేడుకలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను చీఫ్ గెస్ట్‌గా మోదీ ఆహ్వానించారు. 2015లో అప్పటి అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ఒరాక్ ఒబామా భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఇప్పుడు జో బైడెన్ కూడా పాల్గొంటే.. భారత రిపబ్లిక్ డే వేదుకల్లో పాల్గొన్న రెండో అమెరికా అధ్యక్షుడిగా నిలుస్తారు.

కాగా 2020లో బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరవ్వగా.. 2019లో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా, 2017లో సౌదీ రాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, 2016లో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ హోలాండే గ్రేస్ట్ పాల్గొన్నారు. ఇక 2014లో జపాన్ ప్రధాని షింజో అబే, 2013లో భూటాన్ రాజు వాంగ్ చుక్ పాల్గొన్నారు. అంతుకుముందు రష్యా అధ్యక్షుడు పుతిన్, యూకే ప్రధాని జాన్ మేజర్ కూడా హాజరయ్యారు.



Next Story

Most Viewed