రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వార్నింగ్

by Mahesh |
రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా 48వ అధ్యక్ష ఎన్నికలు 2024 నవంబర్ 5న జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలు నవంబర్ 6న వెలువడగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి(Republican Party Candidate), మాజీ అధ్యక్షుడు అయిన డొనాల్డ్ ట్రంప్(Donald Trump) 292 ఎలక్టోరల్ ఓట్లతో భారీ విజయం సాధించారు. దీంతో నవంబర్ 20న ఆయన అమెరికా 48వ అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. అనంతరం పలు కీలక నిర్ణయాలు తీసుకున్న ట్రంప్.. మరికొన్ని సంచలన నిర్ణయాలను కూడా ప్రకటించారు. ఈ క్రమంలోనే ఈరోజు రష్యా అధ్యక్షుడు(Russia President) వ్లాదిమిర్ పుతిన్‌(Vladimir Putin)కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వార్నింగ్(Warning) ఇచ్చారు. శాంతి ఒప్పంద చర్చల(Peace Treaty Negotiations)కు మేము సిద్ధంగా ఉన్నామని.. ఈ చర్చలకు రాకుంటే రష్యాపై మరిన్ని ఆంక్షలు తప్పవని వార్నింగ్ ఇచ్చాడు. అలాగే ఇంతకు ముందు నేను అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఉక్రెయిన్‌(Ukraine)లో సంక్షోభం వచ్చేది కాదని ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చాడు. శాంతి చర్చలపై ట్రంప్ వార్నింగ్ పై రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏ విధంగా స్పందిస్తాడో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.

Advertisement

Next Story

Most Viewed