సినీ కవి గుల్జార్, సంస్కృత పండితుడు రామభద్రాచార్యకు జ్ఞానపీఠ్ పురస్కారాలు

by Hajipasha |
సినీ కవి గుల్జార్, సంస్కృత పండితుడు రామభద్రాచార్యకు జ్ఞానపీఠ్ పురస్కారాలు
X

దిశ, నేషనల్ బ్యూరో : ప్రముఖ ఉర్దూ కవి గుల్జార్, సంస్కృత పండితుడు, ఆధ్యాత్మిక గురువు జగద్గురు రామభద్రాచార్య 58వ జ్ఞాన్‌‌పీఠ్ అవార్డుకు ఎంపికయ్యారు. ఉర్దూ, సంస్కృత భాషల్లో విశేష కృషి చేసినందుకు వారిని ఈ అవార్డుకు ఎంపిక చేశామని జ్ఞాన్‌పీఠ్ ఎంపిక కమిటీ వెల్లడించింది. మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో ఉన్న తులసీ పీఠ్‌ వ్యవస్థాపకుడిగా, పీఠాధిపతిగా జగద్గురు రామభద్రాచార్య ఉన్నారు. విద్యావేత్తగా, రచయితగా 100కిపైగా పుస్తకాలను ఆయన రాశారు. బాల్యంలోనే అంధత్వానికి గురైన రామభద్రాచార్య, దివ్యాంగుల కోసం చిత్రకూట్ లో విద్యాపీఠం ప్రారంభించారు. ఇక బాలీవుడ్ సినిమారంగంలో రచయితగా గుల్జార్‌ ప్రత్యేక ముద్ర వేశారు. ఈ దశాబ్దపు ఉత్తమ ఉర్దూ కవులలో ఒకరిగా ఆయన నిలిచారు. 2002లో గుల్జార్ ఉర్దూలో సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు. 2013లో దాదాసాహెబ్ ఫాల్కే, 2004లో పద్మ భూషణ్ పురస్కారాలను ఆయన పొందారు. ఐదు జాతీయ స్థాయి సినీ అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు.

Next Story