యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

by Disha Web |
యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
X

న్యూఢిల్లీ: యూపీఎస్‌సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ 2022 ఫలితాలను ప్రకటించారు. వీటిని యూపీఎస్‌సీ అధికారిక వెబ్ సైట్‌ అయిన upsc.gov.in. లో చూడవచ్చు. సివిల్ సర్వీసెస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షల కోసం ఎంపికైన అభ్యర్థుల జాబితా కూడా అందుబాటులో ఉంది. అటు సివిల్ సర్వీస్‌కి, ఇటు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌కి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బుధవారం వెల్లడించింది. ప్రిలిమ్స్ పరీక్షల ఫలితాలను యూపీఎస్‌సీ వెబ్ సైట్‌లోనూ, పీడీఎఫ్ రూపంలో కూడా చూడవచ్చు. ప్రిలిమ్స్ పరీక్షల్లో నెగ్గిన అభ్యర్థులు డిటైల్డ్ అప్లికేషన్ ఫామ్-1 (డిఏఎఫ్-1)లో సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామ్ కోసం దరఖాస్తు చేయవచ్చు. 2022 మెయిన్స్ పరీక్షల వివరాలను త్వరలో అధికారిక వెబ్ సైట్‌లో పొందుపరుస్తామని యూపీఎస్‌సి పేర్కొంది.

జూన్ 5, 2022న నిర్వహించిన యూపీఎస్‌సి ప్రిలిమినరీ పరీక్షల ఫలితాల్లో నెగ్గిన అభ్యర్థులు సివిల్ సర్వీస్ మెయిన్ పరీక్షలకు అర్హులవుతారు. వీరు మెయిన్ పరీక్షలు రాయడానికి డీటెయిల్స్ అప్లికేషన్ ఫామ్-1ని మళ్లీ పూరించి పంపాల్సి ఉంటుంది. తేదీలు, డీఎఎఫ్-1 ఫామ్‌ని నింపడానికి సంబంధించిన ముఖ్యమైన సూచనలను యూపీఎస్‌సి వెబ్‌సైట్‌లో త్వరలో ప్రకటిస్తామని సర్వీస్ కమిషన్ ప్రకటించింది.

Next Story