యూపీఎస్‌సీ-2025 పరీక్షల క్యాలెండర్‌ విడుదల

by Dishanational1 |
యూపీఎస్‌సీ-2025 పరీక్షల క్యాలెండర్‌ విడుదల
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్‌సీ) 2025 ఏడాదికి సంబంధించి పరీక్షల క్యాలెండర్‌ను ప్రకటించింది. 2025లో చేపట్టబోయే నియామకాల పోటీ పరీక్షల తేదీలకు చెందిన ప్రత్యేక చార్ట్‌ను యూపీఎస్‌సీ విడుదల చేసింది. ఇందులో 2025 జనవరి నుంచి 2025 డిసెంబర్ మధ్య నిర్వహించే పరీక్షల తేదీలున్నాయి. వివరాల ప్రకార, 2025, జనవరి 22 నుంచి ఫిబ్రవరి 11 వరకు సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షల కొసం దరఖాస్తులను స్వీకరించనున్నారు. మే 25న పరీక్షలు నిర్వహిస్తారు. అదేవిధంగా ఆగష్టు 22 నుంచి ఐదు రోజుల వరకు యూపీఎస్‌సీ మెయిన్స్ పరీక్షలు జరుగుతాయి. అలాగే, సీబీఐ(డీఎస్పీ), ఇంజనీరింగ్ సర్వీస్(ప్రిలిమినరీ), ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్, మెయిన్, సీడీఎస్, సెంట్రల్ ఆరండ్ ఫోర్సెస్, కంబైన్‌డ్ మెడికల్ సర్వీసెస్ సహా వివిధ ఉద్యోగాలకు నియామక పరీక్షలు జరగనున్నాయి. యూపీఎస్‌సీ క్యాలెండర్‌లో ఆయా పోస్టుల నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ, కంప్యూటర్ ఆధారిత పరీక్షల తేదీలు ఉన్నాయి. అప్పటికి పరిస్థితులకు అనుగుణంగా తేదీల్లో మార్పు ఉండొచ్చని యూపీఎస్‌సీ పేర్కొంది.



Next Story

Most Viewed