- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
మొయిన్‌పురి ఉపఎన్నికలో బీజేపీదే విజయం: యూపీ మంత్రి

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీకి ప్రతిష్టాత్మకంగా ఉన్న ములాయం సింగ్ యాదవ్ స్థానం మొయిన్ పురీపై రాష్ట్ర మంత్రి జైవీర్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే నెలలో జరగనున్న ఉపఎన్నికల్లో బీజేపీనే విజయం సాధిస్తుందని అన్నారు. ములాయంకు ఆయన కోడలు డింపుల్ యాదవ్‌కు ఆకాశానికి, నేలకు మధ్య ఉన్న తేడా ఉందని చెప్పారు. అంతకుముందు ఎస్పీ మామా స్థానం నుంచి కోడలు డింపుల్ యాదవ్ ను బరిలోకి దించనున్నట్లు ప్రకటించింది.
ములాయం నేతృత్వంలో ఎస్పీ క్షేత్రస్థాయిలో బలంగా ఉందని చెప్పారు. అయితే అఖిలేష్ యాదవ్ హయాంలో ఏసీ రూంలు, ట్విట్టర్‌కే పరిమితమైందని ఎద్దేవా చేశారు. కాషాయ పార్టీ ఉపఎన్నికల్లో పోటిచేస్తుందని, తప్పక విజయం సాధిస్తుందని చెప్పారు. ఈ ఉపఎన్నిక 2024 లోక్‌సభ ఎన్నికలకు ఫ్లాట్‌ఫాంను సిద్ధం చేస్తుందని, యూపీలో 80 సీట్లు సాధిస్తామని చెప్పారు.
బీజేపీ నుంచి బరిలోకి అభ్యర్థుల జాబితాలో జైవీర్ పేరు కూడా పరిశీలనలో ఉంది. 1996 నుంచి ఎస్పీకి మొయిన్‌పురీ అసెంబ్లీ నియోకవర్గం కంచుకోటగా ఉంది. ఇప్పటికీ 5 సార్లు ములాయం సింగ్ యాదవ్ విజయం సాధించారు. ఈ మధ్యనే ఆయన మరణించిడంతో ఆ స్థానానికి ఖాళీ ఏర్పడింది. దీంతో వచ్చే నెల 5న ఉపఎన్నిక నిర్వహించనున్నారు.