ఉన్నావో ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోడీ

by Shamantha N |
ఉన్నావో ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తరప్రదేశ్‌ ఉన్నావోలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ఈమేరకు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

ఉన్నావోలో ప్రమాదం

ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావోలో బుధవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. పాల ట్యాంకర్ ను డబుల్ డెక్కర్ బస్సు ఢీకొనడంతో 18 మంది చనిపోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. లక్నో- ఆగ్రా ఎక్స్ ప్రెస్ హైవేపై పమాదం జరిగింది. బస్సు బీహార్‌ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిలో సహాయకచర్యలు చేపట్టారు. గాయపడిన వారిని హాస్పిటల్ కు తరలించారు. గాయపడినవారంతా బంగార్ మావ్ సీఎచ్ సీ చికిత్స పొందుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపారు.

Advertisement

Next Story

Most Viewed