మన్మోహన్ సింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి మాండవియా

by Disha Web Desk 16 |
మన్మోహన్ సింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి మాండవియా
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్ లో ధరల పెరుగుదల, జీఎస్టీ పై ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల పాల ఉత్పత్తులపై కూడా జీఎస్టీ వేయడం తో మరింతగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు పెరిగిపోయాయి. తెలంగాణలో కూడా వామపక్షాలు, కాంగ్రెస్, అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా పాల ఉత్పత్తులపై నిత్యావసర సరుకులకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని నిరసనలు చేపట్టారు.

అయితే తాజాగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా కాంగ్రెస్ పార్టీ పై ఆసక్తికర వ్యాఖలు చేశారు.మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు 'ఒక దేశం-ఒకే పన్ను' కింద జీఎస్టీ ని అమలు చేయాలని భావించారని తెలిపారు. కానీ జీఎస్టీ ని అమలు చేయకుండా కాంగ్రెస్ అడ్డుకున్నారు. దీన్ని ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి మొదటి స్థానం ఇచ్చి ఆ తర్వాత ఎన్నికలు పెట్టి జీఎస్టీ ని అమలు చేశారని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు.



Next Story

Most Viewed