ఛత్తీస్గఢ్ సీఎం స్కామ్లకు పాల్పడ్డారు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా

by Dishafeatures2 |
ఛత్తీస్గఢ్ సీఎం స్కామ్లకు పాల్పడ్డారు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా
X

దిశ, వెబ్ డెస్క్: ఛత్తీస్గఢ్సీఎం భూపేష్ బఘేల్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. భూపేష్ బఘేల్ స్కామ్ లకు పాల్పడ్డారని అమిత్ షా ఆరోపించారు. గురువారం రాష్ట్రంలోని దుర్గాలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో 10 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగులకు నెలకి రూ.2,500 భృతి కల్పిస్తామని హామీ ఇచ్చి మరిచారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకు సీఎం సిగ్గుపడాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

యూపీఏ హయాంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్న అమిత్ షా.. మోడీ తొమ్మిదేళ్ల పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదని అన్నారు. కాంగ్రెస్ హయాంలో పాకిస్తాన్ నుంచి టెర్రరిస్టులు దేశంలోకి చొరబడి వచ్చి నానా హింసకు పాల్పడేవారని, కానీ నేడు మోడీ పాలనలో ఒక్క ఉగ్రదాడి కూడా జరగలేదని షా చెప్పారు. కాంగ్రెస్ నేతలకు ప్రజల ప్రాణాలంటే లెక్కలేదని, కానీ మోడీ సర్జికల్ స్ట్రైక్స్ తో టెర్రరిస్టులకు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. దేశానికి మూడోసారి కాబోయే పీఎం మోడీయేనని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.

Next Story