బ్రేకింగ్: ముగిసిన కేంద్ర కేబినెట్ భేటీ.. నిర్ణయాలను బయటపెట్టని మోడీ సర్కార్..!

by Satheesh |   ( Updated:2023-09-18 15:16:29.0  )
బ్రేకింగ్: ముగిసిన కేంద్ర కేబినెట్ భేటీ.. నిర్ణయాలను బయటపెట్టని మోడీ సర్కార్..!
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రమంత్రి వర్గ ప్రత్యేక సమావేశం ముగిసింది. ప్రధాని మోడీ అధ్యక్షతన సోమవారం సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమైన కేబినెట్ భేటీ దాదాపు రెండు గంటల పాటు సాగింది. పార్లమెంట్ భవనంలో జరిగిన ఈ భేటీలో కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను బయటకు వెల్లడించలేదు. దీంతో ఈ సమావేశంలో మంత్రివర్గం ఏ నిర్ణయాలను తీసుకుందనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ భేటీలో పలు కీలక బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.

ఈ పార్లమెంట్ స్పెషల్ సెషన్స్‌లో చారిత్ర్మాక నిర్ణయాలను తీసుకుంటామని ప్రధాని మోడీ పేర్కొనడంతో.. ఇవాళ జరిగిన భేటీలో కేబినెట్ తీసుకున్న డెసిషన్స్‌పై సస్పెన్స్ నెలకొంది. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రం కసరత్తు చేస్తుందని వార్తలు వినిపిస్తుండటంతో.. ఇవాళ్టి మంత్రివర్గ సమావేశంలో ఈ బిల్లుపై కీలక నిర్ణయం తీసుకుని ఉంటారని పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం జరగుతోంది. కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను బయటపెట్టకపోవడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Advertisement

Next Story