- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Uddhav Thackeray: ఉద్ధవ్ వర్గానికి చెందిన ఐదుగురు అసమ్మతి నేతలపై వేటు
దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర(Maharashtra) అసెంబ్లీ ఎన్నికల వేల పొలిటికల్ హీటు పెరిగింది. అధికార మహాయుతి, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీలు సీట్ల పంపిణీపై తర్జనభర్జన పడుతున్నాయి. కాగా.. ఇలాంటి టైంలో మహా వికాస్ అఘాడీ కూటమిలోని శివసేన (యూబీటీ) పార్టీ తమ అసమ్మతి నేతలపై వేటు వేసింది. నామినేషన్‌లను ఉపసంహరించుకోకపోవడం ఉద్ధవ్ ఠాక్రే(Uddhav Thackeray) వర్గానికి ఐదుగురు రెబల్ నేతలపై వేటు వేసినట్లు తెలుస్తోంది. వీరిలో భివాండి తూర్పు ఎమ్మెల్యే రూపేష్, విశ్వ నాందేకర్, చంద్రకాంత్ ఘుగుల్, సంజయ్ అవారి, ప్రసాద్ ఠాక్రేలు ఉన్నారు
నామినేషన్ల ఉపసంహరణ
ఇకపోతే, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు దాఖలు చేసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారంతో ముగిసింది. ఈక్రమంలో శివసేన(యూబీటీ) పార్టీ నుంచి టికెట్ అందని నేతలు ఆయా నియోజకవర్గాల నుంచి స్వతంత్ర్య అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. ఈక్రమంలో వాటిని ఉపసంహరించుకోవాలని పార్టీ ఆదేశించింది. అయినప్పటికి నేతలు వాటిని వెనక్కి తీసుకోకపోవడంతో వారిపై చర్యలు తీసుకున్నట్లు పార్టీ కార్యాలయం పేర్కొంది. ఇక, మొత్తం 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో నవంబరు 20న ఒకే దశలో ఓటింగ్ జరగనుంది. కాగా.. నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి.