ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు.. స్పీకర్ నిర్ణయంపై ఉద్ధవ్ ఠాక్రే ఆగ్రహం

by Shamantha N |
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు.. స్పీకర్ నిర్ణయంపై ఉద్ధవ్ ఠాక్రే ఆగ్రహం
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నిర్ణయంపై ఉద్ధవ్ ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ తన నిర్ణయంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. స్పీకర్ తన నిర్ణయం ప్రకటించిన వెంటనే సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ నర్వేకర్‌ తీరు చూస్తే అధికార పార్టీతో కుమ్మక్కైనట్లు తెలుస్తుందన్నారు. స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామన్నారు. సుప్రీం కోర్టులో ధిక్కరణకేసు వేయాలా.. వద్దా అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. పార్ట రాజ్యాంగం చెల్లకపోతే.. తమని ఎందుకు అనర్హులుగా ప్రకటించలేదని ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందన్న విశ్వాసం ఉందన్నారు. అక్కడే తమకు న్యాయం దొరుకుతుందన్నారు ఉద్ధవ్ ఠాక్రే. స్పీకర్ నిర్ణయంపై ఉద్ధవ్ ఠాక్రే సుప్రీం కోర్టుని ఆశ్రయించాలని ఎన్సీపీ అగ్రనేత శరద్ పవార్ ఉన్నారు. సుప్రీంకోర్టులోనే న్యాయం జరుగుతుందని ఉద్ధవ్ ఆశిస్తున్నారని చెప్పారు. ఇదంతా బీజేపీ కుట్ర అని సంజయ్ రౌత్ స్పందించారు. బాలాసాహెబ్ ఠాక్రే ఏర్పాటు చేసిన శివసేనను అంతం చేయాలనేదే వారి కల అని.. సుప్రీంకోర్టులో తేల్చుకుంటామని అసహనం వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed