దసరా ర్యాలీకి షిండే-థాక్రే వర్గాలకు అనుమతి నిరాకరణ

by Disha Web Desk 21 |
దసరా ర్యాలీకి షిండే-థాక్రే వర్గాలకు అనుమతి నిరాకరణ
X

ముంబై: మహారాష్ట్ర‌లోని ముంబై శివాజీ పార్కులో ప్రతిష్టాత్మకంగా దసరా ర్యాలీని నిర్వహించాలని చూస్తున్న ఉద్ధవ్ థాక్రే, షిండే వర్గాలకు ముంబై మున్సిపల్ కార్పోరేషన్ షాక్ ఇచ్చింది. ఇరు వర్గాలకు ముంబై పాలక సంస్థ(బీఎంసీ) అనుమతి నిరాకరించింది. దీనిపై ఉద్ధవ్ థాక్రే వర్గం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది బీజేపీ చేసిన కుట్రేనని ఆరోపించింది. కాషాయ పార్టీ ఉద్దేశపూర్వకంగానే తమ పార్టీని కార్నర్ చేయాలని చూస్తుందని పేర్కొంది.

అయితే బీఎంసీ‌పై ఉద్ధవ్ థాక్రే వర్గం బాంబే హైకోర్టును ఆశ్రయించగా, శుక్రవారం విచారణ చేపట్టనున్నారు. మరోవైపు శివాజీ పార్కులో శివసేన పార్టీ దసరా ర్యాలీని 1966 నుంచి నిర్వహిస్తోంది. కరోనా నిబంధనల కారణంగా గత రెండేళ్లుగా వేడుకలు నిర్వహించలేదు. తాజాగా పార్టీ రెండు వర్గాలుగా విడిపోవడంతో ర్యాలీ నిర్వహణకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకున్నాయి. అయితే బీఎంసీ మాత్రం దీనికి అనుమతి నిరాకరించింది.


Next Story

Most Viewed