పేమెంట్ విషయంలో కస్టమర్‌ను కొట్టిన ఉబెర్ డ్రైవర్.. రాడ్డు తీసుకొని..

by Disha Web Desk 14 |
పేమెంట్ విషయంలో కస్టమర్‌ను కొట్టిన ఉబెర్ డ్రైవర్.. రాడ్డు తీసుకొని..
X

దిశ, వెబ్‌డెస్క్: ట్యాక్సీ డ్రైవర్స్, కస్టమర్స్ మధ్య గొడవలు జరగడం, అవి కొట్టుకునే వరకు వెళ్లడం షరా మామూలే. కానీ తాజాగా అస్సాంలో జరిగిన ఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది. కస్టమర్‌పై ఓ ఉబెర్ డ్రైవర్ రాడ్డుతో దాడికి పాల్పడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇద్దరు జర్నలిస్టులు ఉబెర్ యాప్‌లో ఓ రైడ్ బుక్ చేశారు. అంతేకాకుండా ఆన్‌లైన్ పేమెంట్ సెలక్ట్ చేసుకున్నారు. కానీ ఉబెర్ డ్రైవర్ మాత్రం తనకు చేతికి డబ్బులు కావాలని వారితో వాగ్వాదానికి దిగాడు. దాంతో జర్నలిస్టుల్లో ఒకరు అందుకు నిరాకరించారు. యాప్‌లో ఒకసారి పేమెంట్ మెథడ్ ఫిక్స్ చేస్తే మళ్లీ మారదని, కాబట్టి తనకు డబ్బులు చేతికి ఇవ్వలేనని చెప్పారు.

దీంతో కోపోద్రిక్తుడైన ఉబెర్ డ్రైవర్ అతడిపై దాడికి పాల్పడ్డాడు. కారులో నుంచి రాడ్డు తీసుకొచ్చి వారిపై దాడి చేశాడు. అంతేకాకుండా అతడిపై కారు ఎక్కించేందుకూ ప్రయత్నించాడు. కానీ జర్నలిస్టులు ఎలాగొలా తప్పించుకున్నారు. వారిలో ఒకరు ఈ విషయం మొత్తాన్ని ట్విట్‌ ద్వారా షేర్ చేసుకున్నారు. దాన్ని గమనించిన పోలీసులు వెంటనే ఆ ట్వీట్‌పై స్పందించారు.

ఆ డ్రైవర్ వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ కమిషనర్ హార్ది సింగ్ 'చర్యలు ప్రారంభమయ్యాయి' అంటూ రిప్లై ఇచ్చారు. ఆ తర్వాత అతి తక్కువ సమయంలోనే క్యాబ్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ విషయంపై ఉబెర్ సంస్థ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్సందించింది. ఈ విషయంపై తమ సేఫ్టీ టీం పనిచేస్తోందని, మీరు మీ ఉబెర్ అకౌంట్‌కు ఇచ్చిన ఫోన్ నెంబర్, ఈమెయిల్‌ను మాకు డైరెక్ట్ మెసేజ్ ద్వారా పంపగలరని తెలిపింది.


Next Story

Most Viewed