దారుణం.. విదేశీ సినిమాలు చూశారనే నెపంతో ఇద్దరు విద్యార్థుల కాల్చివేత

by Disha Web Desk 13 |
దారుణం.. విదేశీ సినిమాలు చూశారనే నెపంతో ఇద్దరు విద్యార్థుల కాల్చివేత
X

ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా ప్రభుత్వం కఠిన శిక్షలను అమలు చేస్తోంది. ఆంక్షల విషయంలో నా రూటే సపరేటు అనేలా వ్యవహరించే కిమ్ ప్రభుత్వం వాటిని ఉల్లంఘించారని ఇద్దరు విద్యార్థులను చంపేసింది. దక్షిణ కొరియా, అమెరికన్ సినిమాలను చూశారని ఇద్దరు ఉన్నత తరగతులు చదివే విద్యార్థులను మరణశిక్ష అమలు చేశారు. ఉత్తర కొరియాలో సినిమాలు చూడటం పై నిషేధం ఉంది. అక్టోబర్ నెలలో వీరిద్దరూ ర్యాంగాంగ్ ప్రావిన్సులో అమెరికా, ఉత్తర కొరియా సినిమాలు చూసినట్లు కథనాలు పేర్కొన్నాయి. దీంతో వారిద్దరిని నగరంలోని ఖాళీ ప్రాంతంలో స్థానికుల ముందు కాల్చి చంపినట్లు వెల్లడించాయి. విద్యార్థులు ఇరువురు చేసిన నేరాలు చెడు అని ప్రభుత్వం పేర్కొంది. స్థానిక చట్టాల ప్రకారం ఇతర దేశాలు సినిమాలు చూడటం తీవ్రమైన నేరం గా పరిగణిస్తోంది. గతేడాది కూడా కిమ్ తండ్రి కిమ్ జాంగ్ 2 వర్థంతిలో పౌరులు నవ్వడం పై నిషేధం విధించింది.


Next Story

Most Viewed