లోక్‌సభలో ఇద్దరు బీజేపీ నేతలకు 100 శాతం అటెండెన్స్

by S Gopi |
లోక్‌సభలో ఇద్దరు బీజేపీ నేతలకు 100 శాతం అటెండెన్స్
X

దిశ, నేషనల్ బ్యూరో: 17వ లోక్‌స‌భ స‌మావేశాలు ఫిబ్ర‌వ‌రి 10వ తేదీన నిర‌వ‌ధిక వాయిదా ప‌డిన సంగతి తెలిసిందే. 2019, జూన్ 17న తొలి సెష‌న్ మొదలైంది. లోక్‌స‌భ రికార్డుల ప్ర‌కారం మొత్తం 543 ఎంపీలు ఉండగా, బీజేపీకి చెందిన ఇద్దరు ఎంపీలు ఒక్క సమావేశానికి కూడా ఎగవేయకుండా 100 శాతం హాజరు సాధించి ప్రత్యేక గుర్తింపు పొందారు. ఈ ఐదేళ్ల కాలంలో మొత్తం 274 సమావేశాలు జరిగాయి. యాదృచ్ఛికంగా ఈ ఇద్దరు ఎంపీలు మొదటిసారి లోక్‌సభలో అడుగుపెట్టారు. వారిలో ఒకరు ఛత్తీస్‌గఢ్‌లోని గిరిజన ప్రాంతం కాంకెర్ ఎంపీ మోహన్ మండావి కాగా, మరొకరు రాజస్థాన్‌లోని అజ్మీర్ ఎంపీ భగీరథ్ చౌదరీ. 'నేను నాకు అప్పగించిన పనిని బాధ్యతతో నిర్వహిస్తాను. గిరిజన ప్రాంతం నుంచి వచ్చిన నేను కరోనా మహమ్మారి సమయంలో కూడా సభకు తప్పనిసరిగా హాజరయ్యాను' అని మోహన్ తెలిపారు. ఇక ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌కు చెందిన చెందిన బీజేపీ సభ్యుడు పుష్పేంద్ర సింగ్ చందేల్ లోక్‌సభలో అత్యంత యాక్టివ్ సభ్యుడిగా ఉన్నారు. ఆయన మొత్తం 1,194 చర్చల్లో, అండమాన్ అండ్ నికోబార్ దీవులకు చెందిన కుల్‌దీప్ రాయ్ శర్మ 833 చర్చల్లో పాల్గొని చురుకైన సభ్యులుగా ఉన్నారు. ఈ సమావేశాల్లో 9 మంది ఎంపీలు ఒక్క‌సారి కూడా మాట్లాడలేదు. వారిలో సినీనటులు స‌న్నీ డియోల్‌, శ‌త్రుఘ్న సిన్హా కూడా ఉన్నారు.



Next Story