రూ.30 కోట్లు ఖర్చు చేశారని ఫేక్ పేపర్లు.. అరెస్టును ఖండించిన సీఎం

by Disha Web Desk 13 |
రూ.30 కోట్లు ఖర్చు చేశారని ఫేక్ పేపర్లు.. అరెస్టును ఖండించిన సీఎం
X

జైపూర్: వివాదస్పదంగా మారిన టీఎంసీ ప్రతినిధి సాకేత్ గోఖలే అరెస్ట్ పై గుజరాత్ పోలీసులు స్పందించారు. ప్రధాని మోడీ మోర్బీ పర్యటనకు రూ.30 కోట్లు వెచ్చించారని తప్పుడు పత్రాలు సృష్టించారనే నెపంతో అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. బెంగాల్ నుంచి రాజస్థాన్ వెళ్లిన సాకే‌త్‌ను సోమవారం రాత్రి జైపూర్ విమానశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాని మోడీ మోర్బీ పర్యటనకు రూ.30 కోట్లు ఖర్చు పెట్టారని ఆర్టీఐ వెల్లడించినట్లు ట్వీట్ చేసినట్లు తెలిపారు. అయితే ఇవి ఫేక్ పత్రాలను నిజ నిర్ధారణలో తేలినట్లు పేర్కొన్నారు. బీజేపీ నేత అమిత్ కొతారీ దీనిపై ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. మరోవైపు తమ పార్టీ నేత సాకేత్ ను అరెస్ట్ చేయడం పై బెంగాల్ సీఎం స్పందించారు. బీజేపీ ప్రతీకార చర్యలకు పాల్పడుతుందని, అరెస్ట్‌ను ఖండించారు. సాకేత్ ఎలాంటి తప్పులు చేయలేదని, తనకు వ్యతిరేకంగా కూడా చాలా మంది ట్వీట్లు చేశారని ఇలాంటి చర్యలు బాధాకరమని అన్నారు.


Next Story

Most Viewed