ఫాస్ట్ ట్యాగ్ ద్వారా రూ. 50,855 కోట్ల రాబడి

by Disha Web Desk 17 |
ఫాస్ట్ ట్యాగ్ ద్వారా రూ. 50,855 కోట్ల రాబడి
X

న్యూఢిల్లీ: రాష్ట్రాల హైవే టోల్ ప్లాజాలతో పాటు ఫీ ప్లాజ్లాలలో ఫాస్ట్ ట్యాగ్ ద్వారా గతేడాది రాబడి 46 శాతం పెరిగిందని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) పేర్కొంది. అంటే ఫాస్ట్ ట్యాగ్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి రూ. 50,855 కోట్ల ఆదాయం సమకూరింది. 2021లో ఈ ఆదాయం రూ. 34,778 కోట్లుగా ఉంది. 2022 డిసెంబర్‌లో ఫీ ప్లాజాలలో ఫాస్ట్ ట్యాగ్ ద్వారా రోజువారీ ఆదాయం రూ. 134.44 కోట్లుగా నమోదైంది. కానీ డిసెంబర్ 24వ తేదీన అత్యధికంగా రూ. 144.19 కోట్ల ఆదాయం వచ్చినట్టు ఎన్‌హెచ్ఏఐ ఒక ప్రకటనలో పేర్కొంది.

అంతేకాదు గతేడాది ఫాస్ట్ ట్యాగ్ ట్రాన్సాక్షన్స్ 48 శాతం పెరిగినట్లు తెలిపింది. ఫాస్ట్ ట్యాగ్ ఆదాయం 2021లో రూ. 219 కోట్లు, 2022 లో రూ. 324 కోట్లు వచ్చినట్లు పేర్కొంది. ఇప్పటి వరకు 6.4 కోట్ల ఫాస్ట్ ట్యాగ్స్‌ను జారీ చేసినట్టు ఎన్‌హెచ్ఏఐ చెప్పింది. ఈ ఫాస్ట్ ట్యాగ్ వల్ల ఎన్‌హెచ్ ఫీ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్‌లు తగ్గిన సంగతి తెలిసిందే.


Next Story

Most Viewed