ఇకపై ఆస్ట్రేలియా వీసాలకు ‘టోఫెల్’ స్కోర్ చెల్లుతుంది

by Hajipasha |
ఇకపై ఆస్ట్రేలియా వీసాలకు ‘టోఫెల్’ స్కోర్ చెల్లుతుంది
X

దిశ, నేషనల్ బ్యూరో : టోఫెల్ అనేది ఇంగ్లిష్ మాట్లాడే విశ్వవిద్యాలయాలలో అడ్మిషన్ కోరే స్థానికేతరుల ఆంగ్ల భాషా సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఉపయోగించే పరీక్ష. ఈ పరీక్షను 160కిపైగా దేశాలలోని 12,500 కంటే ఎక్కువ విద్యా సంస్థలు ఆమోదించాయి. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలోని చాలా వర్సిటీలు, బ్రిటన్‌లోని 98 శాతానికిపైగా వర్సిటీలలో విదేశీ విద్యార్థులకు అడ్మిషన్ ఇచ్చే క్రమంలో టోఫెల్ స్కోరును పరిగణనలోకి తీసుకుంటారు. కొత్త అప్‌డేట్ ఏమిటంటే.. ‘టోఫెల్’ పరీక్ష స్కోర్లు ఇకపై అన్ని ఆస్ట్రేలియన్ వీసాలకు చెల్లుబాటు అవుతాయి. ఈవిషయాన్ని ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్(ఈటీఎస్) సోమవారం ప్రకటించింది. వాస్తవానికి టోఫెల్ స్కోర్ల చెల్లుబాటును గతేడాది జులైలో ఆస్ట్రేలియా హోం శాఖ తాత్కాలికంగా నిలుపుదల చేసింది. దీంతో ఇప్పటివరకు వీసాల జారీలో దాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. తాజాగా ఆ నిర్ణయాన్ని మార్చారు. 2024 మే 5న లేదా ఆ తర్వాత రాసిన టోఫెల్ పరీక్షల స్కోర్లను వీసాల జారీ విషయంలో పరిగణనలోకి తీసుకుంటామని ఈటీఎస్ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed