టీఎంసీ డైలమాలో ఉంది.. పొత్తు గురించి బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడి కామెంట్స్

by Shamantha N |
టీఎంసీ డైలమాలో ఉంది.. పొత్తు గురించి బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడి కామెంట్స్
X

దిశ, నేషనల్ బ్యూరో: బెంగాల్ లో ఇండియా కూటమిపై సీట్ల షేరింగ్ విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు. కాంగ్రెస్ తో పొత్తు ఉంటే తప్ప..బెంగాల్ లో మైనారీటీ వర్గాలు టీఎంసీకి మద్దతు ఇవ్వకపోవచ్చన్నారు. టీఎంసీ సందిగ్ధ పరిస్థితిలో ఉందన్నారు. మమతా బెనర్జీ నుంచి ఇండియా కూటమిపై స్పష్టమైన ధ్రువీకరణ లేదా నిరాకరణ ఉండాలన్నారు. పొత్తు చర్చలు ముగిశాయని.. టీఎంసీ అధికారికంగా ప్రకటించలేదన్నారు. టీఎంసీలో విరుద్ధమైన అభిప్రాయాల వల్లే ఈ సంకోచం అని అన్నారు. ఇండియా కూటమితో కాకుండా.. ఒంటరిగా పోటీ చేస్తే.. బెంగాల్ లోని మైనారిటీలకు వ్యతిరేకంగా ఓటు వేయడానికి దారితీయవచ్చారు.

టీఎంసీలో అంతర్గత చర్చ జరుగుతోందని.. పొత్తు కావాలని ఓ వర్గం కోరుకుంటుందన్నారు. కానీ మోడీ ప్రభుత్వం తమపై ఈడీ, సీబీఐలను వాడే ఛాన్స్ ఉందని మరో వర్గం భయపడుతోందన్నారు. నిర్ణయాత్మక ముగింపు కోసం ఢిల్లీలో చర్చలు ఉండొచ్చు కానీ.. అలాంటి వాటి గురించి ఏం చెప్పలేనన్నారు అధీర్ రంజన్ చౌదరి.

రాబోయే లోక్‌సభ ఎన్నికలలో తమ పార్టీ రాష్ట్రంలో స్వతంత్రంగా పోటీ చేస్తుందని మమతా గతంలో ప్రకటించింది. సరిగ్గా నెల తర్వాత టీఎంసీ తమ వైఖరి మార్చుకుంది. బెంగాల్ లో సీట్ల పంపకంలో ఏదైనా పురోగతి సాధించాలంటే కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలుస్తోంది.

పశ్చిమ బెంగాల్, మేఘాలయ మరియు అస్సాం కోసం కాంగ్రెస్‌కు టీఎంసీ ఆఫర్ స్థిరంగా ఉంది. టీఎంసీ అధికారంలో ఉన్న బెంగాల్‌లో మొత్తం 42 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌కు రెండు లోక్‌సభ స్థానాలను కేటాయించేందుకు ఆ పార్టీ సుముఖంగా ఉంది. కానీ 7 నుంచి 10 సీట్లు కావాలని కాంగ్రెస్ కోరింది. దీంతో కాంగ్రెస్, టీఎంసీ మధ్య విభేదాలు బయటపడ్డాయి.



Next Story

Most Viewed