బీజేపీలో చేరిన తమిళనాడు ముడుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయధరణి

by Dishanational6 |
బీజేపీలో చేరిన తమిళనాడు ముడుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయధరణి
X

దిశ, నేషనల్ బ్యూరో: మూడుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన విజయధరణి బీజేపీలో చేరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి ఎల్‌ మురుగన్‌, తమిళనాడు ఎన్నికల ఇన్‌ఛార్జ్‌ అరవింద్‌ మీనన్‌ సమక్షంలో విజయధరణి కాషాయ కండువా కప్పుకున్నారు. బీజేపీలో చేరే ముందు కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తూ ఆమె లేఖను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం విలవంకోడ్ ఎమ్మెల్యేగా ఉన్నారు విజయధరణి. ప్రధాని మోడీ నాయకత్వం దేశానికి చాలా ముఖ్యమని పేర్కొన్నారు విజయధరణి. దీంతో దక్షిణాదిలో ఆధిక్యం సాధించేందుకు ఉవ్విళ్లూరుతున్న బీజేపీ ఆశలు చిగురిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అనేక మంచి పథకాలు అమలు చేస్తోందని విజయధరణి కొనియాడారు. డీఎంకే-కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉన్న తమిళనాడులో కొన్ని పథకాలు అమలు కావట్లేదని దుయ్యబట్టారు.

మోడీ నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు సమాజంలోని వివిధ వర్గాల ప్రజలు బీజేపీలో చేరేందుకు ముందుకు వస్తున్నారని మురుగన్ అన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులోని 39 లోక్‌సభ స్థానాల్లో ఒక్కటి కూడా బీజేపీ గెలవలేకపోయింది.


Next Story

Most Viewed