తేజస్వికి, లాలూకి ప్రజలమనోభావాలతో పని లేదు- మోడీ

by Shamantha N |
తేజస్వికి, లాలూకి ప్రజలమనోభావాలతో పని లేదు- మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: నవరాత్రుల్లో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ చేపలు తింటున్న వీడియోపై మోడీ విరుచుకుపడ్డారు. ప్రతపక్షాలు బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. నిర్ధిష్ట ఓట్ బ్యాంకు కోసం.. మెజారిటీ జనాభా మనోభావాలను పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. తేజస్వీ యాదవ్ పోస్టు చేసిన వీడియోను ఉద్దేశించే విమర్శలు గుప్పించారు. నవరాత్రి ప్రారంభానికి ముందు తేజస్వీ యాదవ్ ఓ వీడియోను పోస్ట్ చేశారు. ప్రజలు ఏం తింటున్నారు..? ఏం ధరిస్తున్నారు..? అనే విషయాల్లో బీజేపీ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. అసలు ప్రజలకు ఏం అవసరమో అది మాత్రం చేయట్లేదని ఆరోపించారు.

జమ్ముకశ్మీర్ ఉదంపూర్‌లో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోడీ విపక్ష నాయకులపై ఫైర్ అయ్యారు. గతేడాది సెప్టెంబర్ నెలలో రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ మాసం వండుకుని తిన్న వీడియో గురించి ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు. శ్రావణ మాసంలో దోషిగా తేలిన ఓ వ్యక్తి ఇంటికి వెళ్లి మాంసం వండుకుని తిన్నారని గుర్తుచేశారు. దేశప్రజల్ని టీజ్ చేయడమే రాహుల్, లాలూ ఉద్దేశమని వారిపై ఫైర్ అయ్యారు.

చట్టం ఎవరిని ఏమి తినకుండా ఆపలేదన్న మోడీ.. ప్రతిపక్షాల ఉద్దేశం మాత్రం వేరే అని అన్నారు. మొఘలులు కూడా దాడి చేసి రాజును ఒంటరి చేసి ఓడించడంతో తృప్తి చెందలేదన్నారు. దేవాలయాలను ధ్వంసం చేసే వరకు వారికి సంతృప్తి కలగలేదన్నారు. శ్రావణ మాసంలో వీడియోలు అప్లోడ్ చేయడం ద్వారా ప్రతపక్షాల ఆలోచనలు మొఘలల కాలం నాటివిగా కన్పిస్తున్నాయన్నారు. ప్రజలను మనోభావాలు దెబ్బతీసేందుకు, వారి ఓటు బ్యాంకును బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఇదంతా చేసి ఎవరిని సంతృప్తి పరచాలని అనుకుంటున్నారు? అని ప్రశ్నించారు.

Next Story

Most Viewed