లవ్ మ్యారేజ్ చేసుకున్న జంటకు గ్రామ పెద్దల అభ్యంతరం.. అన్నా చెల్లెలు అవుతారంటూ

by Disha Web Desk 21 |
లవ్ మ్యారేజ్ చేసుకున్న జంటకు గ్రామ పెద్దల అభ్యంతరం.. అన్నా చెల్లెలు అవుతారంటూ
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రేమ, పెళ్లి.. ఈ రెండు పదాలు పలకడానికి సంపుల్‌గా ఉన్నా.. ఆ రెండు ఒకటవ్వాలంటే ఎన్నో కష్టాలు, బాధలు అనుభవించవలసి ఉంటుంది. ఒకవేళ అవన్నీ అనుభవించినా.. లవ్ మ్యారేజ్ జరుగుతుందా అంటే అందుకు కూడా గ్యారెంటీ లేదు. అయితే అలాంటి బాధలు ఎన్నో అనుభవించిని ఓ జంట లవ్ మ్యారేజ్ చేసుకుని సంతోషంగా ఉన్నారు. ఇక జీవితాంతం కలిసుండాలనుకున్న వారి కళలను ఊరి పెద్దలు నిర్వీర్యం చేశారు.

ఉత్తరప్రదేశ్‌ మేరఠ్ జిల్లాలోని ఓ కాలేజీలో చదువుకుంటున్న యువతి యువకుడు ప్రేమించుకున్నారు. వారి ప్రేమ పెళ్లి పీటలెక్కి జీవితాంతం సంతోషంగా కలిసి ఉండాలనుకున్నారు. దీంతో దేవుని సమక్షంలో మ్యారేజ్ చేసుకున్నారు. అయితే గ్రామ పెద్దలు మాత్రం వారి పెళ్లిని తిరస్కరించారు. అమ్మాయి, అబ్బాయి గోత్రం ఒక్కటేనంటూ.. లెక్క ప్రకారం వీరిద్దరూ అన్నాచెల్లెలు అవుతారని అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాకుండా అలాంటి పెల్లి చేసుకుంటే ఊరికి మంచిది కాదని.. అందువల్లనే వారి వివాహాన్ని రద్దు చేస్తునట్లు తీర్పు ఇచ్చారు. దీంతో గ్రామ పెద్దల తీర్పుకు ప్రేమ జంట షాక్‌కి గురైంది. ఇక ఏం చేయాలో తెలియని ఆ జంట పోలీసులను ఆశ్రయించారు.Next Story

Most Viewed