రెడ్‌క్రాస్‌లో సమయానకూల మార్పులు అవసరం: మన్సూఖ్ మాండవీయా

by DishaWebDesk |
రెడ్‌క్రాస్‌లో సమయానకూల మార్పులు అవసరం: మన్సూఖ్ మాండవీయా
X

న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య మన్సూఖ్ మాండవీయా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో రెడ్‌క్రాస్ కాలనుగుణంగా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. విస్తృతమైన జనాబాను చేరుకునేందుకు అవిష్కృత, సహకార భాగస్వామ్యాలు అవసరమని చెప్పారు. గురువారం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సోసైటీ సమావేశంలో మాండవీయా మాట్లాడారు. 'సేవ, సహాయం అనేది మన వారసత్వంలోనే ఉన్నాయి. ఇవన్నీ సంస్కారంలో అంతర్గత భాగాలు.

ఇవి అవసరమైన, అత్యవసర సమయాల్లో మానవాళికి సహాయం చేయడానికి దాని పనికి ప్రసిద్ధి చెందిన ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ నినాదాన్ని కూడా నొక్కి చెబుతాయి' అని అన్నారు. నమ్మకం అంటే రెడ్‌క్రాస్‌గా గుర్తింపు పొందిందని చెప్పారు. అయితే కాలానుగుణంగా మారకపోతే గుర్తింపును కోల్పోవాల్సి వస్తుందని తెలిపారు. కాగా, ప్రస్తుతం ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ(ఐఆర్సీఎస్)కి మాండవీయా అధ్యక్షుడిగా ఉన్నారు.

We are Hiring SEO Executive for Telugu News website.
For more details Click here
Send us your resume to:[email protected] / Whatsapp 8886424242

Next Story

Most Viewed