దీదీ సర్కార్కు బిగ్ షాక్.. ఆ నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు

by Dishafeatures2 |
దీదీ సర్కార్కు బిగ్ షాక్.. ఆ నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
X

దిశ, వెబ్ డెస్క్: బెంగాల్ లోని దీదీ సర్కార్ కు సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ‘ది కేరళ స్టోరీ’ మూవీని బెంగాల్ లో బ్యాన్ చేస్తూ మమతా బెనర్జీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై దేశ అత్తున్నత న్యాయస్థానం స్టే విధించింది. బెంగాల్ ప్రభుత్వం విధించిన బ్యాన్ ను సవాల్ చేస్తూ ది కేరళ స్టోరీ మూవీ ప్రొడ్యూసర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో గురువారం కేసు విచారణ చేపట్టిన సీజఐ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టింది. లా అండ్ ఆర్డర్ ను కాపాడాల్సిన బాధ్యత బెంగాల్ ప్రభుత్వంపై ఉన్నదని.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ నుంచి ఈ మూవీకి అనుమతి లభించిన నేపథ్యంలో మూవీ ప్రదర్శనకు అనుమతి ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది.

లా అండ్ ఆర్డర్ పేరుతో సినిమాలను బ్యాన్ చేయడం తగదని కోర్టు పేర్కొంది. అలా అయితే ప్రతి సినిమాకు ఇలాంటి పరిస్థితులే వస్తాయని కోర్టు అభిప్రాయపడింది. కాగా కేరళలో ప్రేమ పేరుతో దాదాపు ౩౨ వేల మంది యువతులను లోబర్చుకొని వారిని ఇస్లాంలోకి మార్చారని, అనంతరం వారందరినీ ఐసిష్ ఏజంట్లుగా మారుస్తున్నారనే కథాంశంతో ది కేరళ స్టోరీ మూవీని మేకర్స్ తెరకెక్కించారు. ఇక విడుదలైన నాటి నుంచి ఈ మూవీపై భిన్నాభిప్రాయాలు వినబడుతున్నాయి. ఈ మూవీని ఇప్పటికే కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు బ్యాన్ చేశాయి.

Also Read..

బ్రేకింగ్: కర్నాటక సీఎంగా సిద్ధరామయ్య.. అధికారికంగా ప్రకటించిన AICC

Next Story

Most Viewed