రన్నింగ్ ట్రైన్ నే ఆపేసిన గిత్తల కుమ్ములాట!.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

by Ramesh Goud |
రన్నింగ్ ట్రైన్ నే ఆపేసిన గిత్తల కుమ్ములాట!.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: గిత్తల కుమ్ములాట ఓ చోట రన్నింగ్‌లో ఉన్న ట్రైన్‌ను సైతం ఆపేసిన ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది.దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉత్తరప్రదేశ్ లోని ఓ రైల్వే స్టేషన్ పరిధిలోని ఓ జంక్షన్ వద్ద రైలు వస్తుందని గేటు వేశారు. దీంతో ఇరువైపుల వాహానాలు ఆగిపోయాయి. అదే సమయంలో అక్కడే ఉన్న రెండు ఎద్దులు కొట్లాడుకోవడం ప్రారంభించాయి. ఒకదానిపై మరొకటి కొమ్ములతో దాడి చేసుకుంటున్నాయి. ఇది చూసిన వాహానదారులు వారించే ప్రయత్నం చేసిన అవి అలాగే పోట్లాడుకుంటూ.. గేటు కింద నుంచి రైల్వే ట్రాక్ మీదికి వెళ్లాయి.

గేట్ మెన్ వాటిని విదిలించే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది. అదే సమయలో ట్రైన్ రావడం కూడా మొదలైంది. ఇది చూసిన లోకో పైలట్ హారన్ మోగించినా ఆ ఎద్దులు పట్టు విడవడం లేదు. దీంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని భావించిన లోకోపైలట్ అప్రమత్తమయ్యాడు. ట్రైన్ కు బ్రేక్ వేసి తక్షణమే నిలిపివేశాడు. కొద్దిసేపటి తర్వాత ఆ గిత్తలు విడిపోయి వాటి దారిన అవి వెళ్లిపోవడంతో ట్రైన్ ప్రయాణం ప్రారంభమైంది. దీనికి సంబందించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ప్రమాదం జరగకుండా చూసిన లోకో పైలట్ చతురతను మెచ్చుకుంటున్నారు.

Next Story