బ్రేకింగ్: కేంద్ర న్యాయ శాఖ మంత్రిగా కిరణ్ రిజిజు ఔట్

by Disha Web Desk 19 |
బ్రేకింగ్: కేంద్ర న్యాయ శాఖ మంత్రిగా కిరణ్ రిజిజు ఔట్
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర కేబినెట్‌లో ఇద్దరు మంత్రుల శాఖల్లో మార్పులు చేసింది. కిరణ్‌ రిజిజును న్యాయశాఖ నుంచి తొలగించి.. నూతన న్యాయశాఖ మంత్రిగా అర్జున్‌ రామ్‌ మేఘవాల్ నియమించింది. ప్రస్తుతం న్యాయశాఖ మంత్రిగా ఉన్న కిరణ్‌ రిజిజుకు ఎర్త్‌ సైన్స్‌ శాఖను కేటాయించింది. అనూహ్యంగా కేంద్రం కేబినెట్‌లో మార్పులు చేయడం పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే, గత కొద్ది రోజులుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామక విషయంలో, న్యాయమూర్తుల విషయంలో మంత్రి కిరణ్ రిజిజు చేసిన కామెంట్స్ వివాదస్పదంగా మారాయి. ఈ నేపథ్యంలో ఆయనను కేంద్ర ప్రభుత్వం న్యాయ శాఖ నుండి తొలగించిందని వార్తలు వినిపిస్తున్నాయి.

Next Story