Bihar: 12 కోట్లతో నిర్మించిన వంతెన.. ప్రారంభోత్సవానికి ముందే కూలిపోయింది.

by Indraja |
Bihar: 12 కోట్లతో నిర్మించిన వంతెన.. ప్రారంభోత్సవానికి ముందే కూలిపోయింది.
X

దిశ వెబ్ డెస్క్: ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో నేపాల్ అతలాకుతలం అవుతోంది. ఈ నేపథ్యంలో బీహార్‌లో సిక్తి ప్రాంతంలో బక్రా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీనితో బక్రా నదిపై కట్టిన వంతెన బీహార్‌లోని అరారియా వద్ద కూలిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌లోని అరారియా జిల్లాలోని సిక్తి-కుర్సకాంత మధ్య రాకపోకల నిమిత్తం ఐదు సంవత్సరాల క్రితం బక్రా నదిపై రూ. 12 కోట్లు ఖర్చుతో ప్రభుత్వం వంతెన నిర్మించింది.

కగా త్వరలో ఈ వంతెనను ప్రారంభించేందుకు స్థానిక ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అయితే ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల దాటికి నదీ ప్రవాహం ఉధృతంగా మారింది. ఈ నేపథ్యంలో నదీ ప్రవాహం దాటికి పార్డియా ఘాట్‌పై నిర్మించిన వంతెన మూడు పిల్లర్లు బాగా దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో నిన్న ఆ మూడు పిల్లర్లు నదీ ప్రవాహంలో కొట్టుకుపోయాయి. కాగా ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

అయితే కోట్ల రూపాయలు వ్యచించి నిర్మించిన వంతెన ప్రారంభోత్సవానికి ముందే కూలిపోవడంపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జి కూలడానికి నాసిరకం నిర్మాణమే కారణమని ఆరోపిస్తున్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన వంతెన ప్రారంభోత్సవానికి ముందే కూలిపోయింది. బీహార్‌లో వచ్చిన తుఫాను కారణంగా వంతెనలు ఒకదాని తర్వాత ఒకటి కూలిపోతున్నాయి.

కొన్ని దశాబ్ధాల కాలంపాటు ప్రకృతి విపత్తులను తట్టుకునేలా వంతెన నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకుంటారు. కాని బీహార్‌లో వంతెనలు మాత్రం అటు వర్షం కురవడమే ఆలస్యం ఇటు పేకమేడల్లా కుప్పకూలుతున్నాయి. దీనితో ప్రభుత్వం తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. కాగా ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే విజయ్ కుమార్ మండల్ స్పందించారు. ‘కూలిపోయిన వంతెనను రూరల్ వర్కర్స్ డిపార్ట్‌మెంట్ నిర్మిస్తోంది.

అయితే వాళ్లు ఆ వంతెనను బలంగా, నాణ్యతాప్రమాణాలను పాటిస్తూ నిర్మిస్తారని ఆశించాం, కాని కురిసిన వర్షాలకు వంతెన కొట్టుకుపోయిందంటే, వంతెన నిర్మాణంలో సంబంధిత అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో, డిపార్ట్‌మెంట్‌లోని కాంట్రాక్టర్ ఎంత అవినీతికి పాల్పడ్డారో అర్థం అవుతోంది. కనుక ఈ పనిలో పాల్గొన్న కాంట్రాక్టర్‌పై అలానే గ్రామీణ పనుల శాఖ అధికారులపై సైతం కఠిన చర్యలు తీసుకుంటాం.’ అని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed