ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఈ పార్టీయే భారీగా ఖర్చు చేసింది.. ఎంతో తెలుసా?

by Disha Web Desk 21 |
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఈ పార్టీయే భారీగా ఖర్చు చేసింది.. ఎంతో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ సంవత్సరం ఫిబ్రవరి - మార్చిలో ఐదు రాష్ట్రాల్లో (ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్) అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఎన్నికల్లో బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో ఘన విజయం సాధించగా.. ఆప్ ఒక రాష్ట్రంలో గెలుపొందింది. ఇక, కాంగ్రెస్ మాత్రం ఘోర పరాజయం చవిచూసింది. ఇకపోతే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే రాజకీయ పార్టీలు తమ ఎన్నికల వ్యయాల నివేదికలను ఈసీ వద్ద పొందుపరచాల్సి ఉంటుంది. అందువల్ల ఈ అసెంబ్లీ ఎన్నికల వివరాల నివేదికలను ఇటీవల బీజేపీ ఈసీకి అందజేసింది. ఇక అందుకు సంబంధించిన వివరాలను ఎన్నికల సంఘం గణాంకాలు వెల్లడించాయి. అందులో..

బీజేపీ పార్టీ ఐదు రాష్ట్రాల్లో మొత్తం రూ.340కోట్లకు పైగా ఖర్చు చేసింది. అందులో యూపీలో సుమారు రూ. 221కోట్లు, ఉత్తరాఖండ్‌లోని రూ. 43.67కోట్లు, మణిపూర్‌లోని రూ. 23కోట్లు, పంజాబ్‌లోని రూ. 36కోట్లు, గోవాలో రూ. 19కోట్లు ఖర్చు చేసినట్లు నివేదికలో పేర్కొంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఈ ఐదు రాష్ట్రాల్లో రూ. 194కోట్లు వెచ్చించింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రూ.47.54కోట్లు ఖర్చు చేయగా.. ఆప్ పార్టీ రూ.11.32కోట్లు వెచ్చించినట్లు ఆయా పార్టీ నివేదికలు తెలియజేశాయి.


Next Story

Most Viewed