ఆ సీఎం ఓ కీలుబొమ్మ, సొంత ప్యూన్‌ని కూడా మార్చుకోలేరు: కేజ్రీవాల్

by Mahesh |
ఆ సీఎం ఓ కీలుబొమ్మ, సొంత ప్యూన్‌ని కూడా మార్చుకోలేరు: కేజ్రీవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్ ఎన్నికలో ప్రచారంలో ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అయిన అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ సీఎం పై కీలక విమర్శలు చేశారు. భూపేంద్ర పటేల్‌ గుజరాత్‌కు 'కీలుబొమ్మ ముఖ్యమంత్రి' అని, 'సొంత ప్యూన్‌ను మార్చుకునే అధికారం కూడా ఆయనకు లేదని' కేజ్రీవాల్ అన్నారు. గుజరాత్‌లో ఆప్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదాన్‌ గధ్వి తరపున ఆయన మాట్లాడుతూ, ప్రజలకు 'తోలుబొమ్మ సీఎం' కావాలా లేక చదువుకున్న సీఎం కావాలా అని ప్రశ్నించారు. కేజ్రీవాల్ ఇంకా మాట్లాడుతూ గాధ్వీ హృదయం పేదల కోసం కొట్టుకుంటుందని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed