ఆలయం పిక్నిక్ స్పాట్ కాదు: మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

by Dishanational2 |
ఆలయం పిక్నిక్ స్పాట్ కాదు: మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: దేవాలయం పిక్నిక్ స్పాట్ కాదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. హిందూ ఆలయంలోకి హిందువులు కాని వారిని అనుమతించొద్దని తెలిపింది. ఈ మేరకు ఆలయంలో బోర్డులు ఏర్పాటు చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలోని దిండిగల్ జిల్లాలోని ఓ హిందూ దేశాలయంలో ఇటీవల కొంత మంది హిందువేతరులు పిక్నిక్ స్పాట్‌గా భావించి, ఆలయ ఆవరణలో మాంసాహారం తీసుకున్నారు. దీంతో డీ సెంథిల్ కుమార్ అనే వ్యక్తి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అరుల్మిగు పళని దండాయుతపాణి స్వామి ఆలయం, దానిలోని ఉప ఆలయాల్లోకి హిందువులను మాత్రమే అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి అన్ని ప్రవేశ ద్వారాల వద్ద డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ ఎస్ శ్రీమతి నేతృత్వంలోని బెంచ్ విచారణకు స్వీకరించింది. ఆలయాన్ని ఎవరైనా సందర్శించే టూరిస్ట్ స్పాట్ కాదని, హిందువులు తమ మతాన్ని విశ్వసించే ప్రాథమిక హక్కు అని వ్యాఖ్యానించింది. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద, ధ్వజస్తంభం దగ్గర, ఆలయంలోని ప్రముఖ ప్రదేశాల్లో ‘టెంపుల్‌లోకి హిందువులు కానివారిని అనుమతించరు’ అనే బోర్డులు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రతివాదులు ఈ రిట్ పిటిషన్‌ను పళని దేవాలయం కోసం మాత్రమే దాఖలు చేశారని, కానీ లేవనెత్తిన అంశం చాలా పెద్ద సమస్య అని తెలిపింది.


Next Story

Most Viewed