దేశంలో ఎన్డీఏ లేదు: తేజస్వీ యాదవ్

by Disha Web Desk 21 |
దేశంలో ఎన్డీఏ లేదు: తేజస్వీ యాదవ్
X

పాట్నా: రాష్ట్రీయ జనతా దళ్ నేత, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎన్డీఏనే లేదని అన్నారు. ఇప్పటికే జేడీ(యూ), ఆకాళీ దళ్, శివసేన వంటి పార్టీలు బీజేపీతో తెగదెంపులు చేసుకున్నాయని అన్నారు. ఆదివారం ఆయన మాజీ ఉపప్రధాని దేవీలాల్ జయంతి ఉత్సవాల్లో ఐఎన్ఎల్డీ ర్యాలీలో ప్రసంగించారు. బీజేపీ తన తప్పుడు ఆరోపణలు, అబద్దపు వాగ్దానాలతో అతిపెద్ద అబద్దాల పార్టీగా మారిందని విమర్శించారు. కాగా, 2024 లోక్ సభ ఎన్నికల్లో థర్డ్ ఫ్రంట్ బలోపేతం చేసేందుకు హర్యానాలో దేవి లాల్ సమాన్ ర్యాలీ లో పాల్గొనేందుకు విపక్ష నేతలను ఐఎన్ఎల్డీ నేత ఓం ప్రకాశ్ చౌతలా ఆహ్వానించారు.

2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు అధికార బీజేపీకి వ్యతిరేకంగా భావసారూప్యత కలిగిన శక్తుల ఏకీకరణకు గుర్తుగా జరిగే చారిత్రాత్మక సమావేశం ఇదేనని జేడీయూ నేత కేసీ త్యాగీ అన్నారు. ఈ సమావేశంలో నితీష్ కుమార్, శరద్ పవార్, కేసీ త్యాగీ, సుఖ్బీర్ సింగ్ బాదల్, సీతారాం ఏచూరి, తేజస్వి యాదవ్, ఫరూక్ అబ్దుల్లా, శివసేన నేత అరవింద్ సావంత్ పాల్గొనే అవకాశం ఉంది. అయితే ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ గైర్హాజరు కానుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.


Next Story

Most Viewed