ఫడ్నవీస్‌పై సంజయ్ రౌత్ ప్రశంసలు

by Seetharam |
ఫడ్నవీస్‌పై సంజయ్ రౌత్ ప్రశంసలు
X

ముంబై: జైలు నుంచి విడుదలైన మరుసటి రోజే థాక్రే శివసేన నేత సంజయ్ రౌత్ బీజేపీ నేతపై ప్రశంసలు కురిపించారు. మహరాష్ట్రలో షిండే ప్రభుత్వం కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుందని అన్నారు. వాటిని తాము ఉద్దేశపూర్వకంగా వ్యతిరేకించలేమని చెప్పారు. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ మంచి నిర్ణయాలు తీసుకున్నారని తాను పేపర్లలో చదివానని చెప్పారు. పేదలకు గృహనిర్ణయాలు వంటివి ప్రశంసనీయమని అన్నారు. మహారాష్ట్ర హౌసింగ్ సంస్థ నుంచి తమ ప్రభుత్వం కొన్ని హక్కులను తమ ప్రభుత్వం లాక్కుందని అది తనకు నచ్చలేదని తెలిపారు.

అయితే ఫడ్నవీస్ వీటిని తిరిగి తీసుకొచ్చారని చెప్పారు. తాను త్వరలోనే ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా‌తో పాటు ఫడ్నవీస్‌ను కలవనున్నట్లు చెప్పారు. మనీ లాండరింగ్ కేసులో ఈడీ సంజయ్ రౌత్‌ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 100 రోజులకు పైగా జైలులో ఉన్న తర్వాత సంజయ్ బెయిల్‌పై విడుదలయ్యారు. బెయిల్‌పై బయటకు వచ్చాక ఆయన ఇంట్లో ఉద్ధవ్ థాక్రేతో కలిశారు. గతంలో బీజేపీపై తీవ్ర విమర్శలు చేసిన సంజయ్, తాజాగా గొంతు మార్చడం అనేక సందేహాలకు తావిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed