- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తమిళనాడులో కొత్త వ్యవస్థ.. మహిళల భద్రత కోసం ‘సింగప్పెన్’ టాస్క్ ఫోర్స్ ప్రారంభించిన సీఎం విజయ్
తమిళనాడులో మహిళలు, చిన్నారుల రక్షణే ధ్యేయంగా సీఎం విజయ్ ఒక కీలక విభాగాన్ని అందుబాటులోకి తెచ్చారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడులో మహిళలు, చిన్నారుల రక్షణే ధ్యేయంగా సీఎం విజయ్ ఒక కీలక విభాగాన్ని అందుబాటులోకి తెచ్చారు. పూర్తిగా మహిళా సిబ్బందితోనే నడిచే ‘సింగప్పెన్ స్పెషల్ టాస్క్ ఫోర్స్’ను ఆయన అధికారికంగా ప్రారంభించారు. ఈ ప్రత్యేక విభాగం ఏర్పాటు కోసం ప్రభుత్వం రూ. 354 కోట్లను కేటాయించింది.
స్వయంగా వాహనం నడిపిన సీఎం..
మంగళవారం టాస్క్ ఫోర్స్ చిహ్నాన్ని ఆవిష్కరించిన అనంతరం, ఈ బృందాల కోసం కేటాయించిన ప్రత్యేక గస్తీ వాహనాలలో ఒకదానిని సీఎం విజయ్ స్వయంగా డ్రైవ్ చేసి ప్రారంభించారు. విద్యార్థినులు, ఉద్యోగినుల భద్రత కోసం రాష్ట్రవ్యాప్తంగా డ్రోన్‌లను మోహరించనున్నారు. వేధింపులకు పాల్పడే వారిపై వీటి ద్వారా నిఘా ఉంచి తక్షణ చర్యలు తీసుకుంటారు. మహిళలపై జరిగే నేరాలకు, మాదకద్రవ్యాల (డ్రగ్స్) వ్యాప్తికి దగ్గరి సంబంధం ఉందని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఇలాంటి నేరాలను ఏమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ‘రాష్ట్రంలో ఏ మహిళా భయంతో జీవించకూడదు. తాము సురక్షితంగా ఉన్నామనే నమ్మకంతో ప్రతి ఒక్కరూ బయటకు రావాలి. స్త్రీలపై వేధింపులు కేవలం శాంతిభద్రతల సమస్య మాత్రమే కాదు, ఇది సమాజం అంతా ఆలోచించాల్సిన విషయం.’ అని సీఎం విజయ్ తెలిపారు.






