Supreme Court: న్యాయం వేధించే సాధనం కాకూడదు

by srinivas |
Supreme Court: న్యాయం వేధించే సాధనం కాకూడదు
X
  • పనికిమాలిన కేసులలో అప్రమత్తత అవసరమని కింది కోర్టులకు సూచన

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టం అనేది నిందుతులను ఇబ్బంది పెట్టేందుకు సాధనంగా ఉపయోగించకూడదని పేర్కొంది. పనికిమాలిన కేసులతో దాని పవిత్ర స్వభావాన్ని వక్రీకరించకుండా కోర్టులు ఎల్లప్పుడూ చూసుకోవాలని తెలిపింది. ఇద్దరు వ్యక్తులపై చెన్నై కోర్టులో నేరారోపణలను అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది. అమాయకులను రక్షించేలా చట్టం ఉండాలని అంతేకానీ వారిని బెదిరించే కత్తి కాకూడదని పేర్కొంది. తమపై దాఖలైన క్రిమినల్ కేసును కొట్టివేయాలని మద్రాస్ కోర్టును ఆశ్రయించగా అందుకు నిరాకరించింది.

అయితే హైకోర్టు తీర్పును తాజాగా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో ఫిర్యాదు నమోదుకు, దర్యాప్తు ప్రారంభానికి మధ్య నాలుగేళ్ల సమయం ఉందని ఇది కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. అంతేకాకుండా ఫిర్యాదులోని ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు గుర్తించలేదని తెలిపింది. కొన్ని కేసుల్లో మాత్రమే క్రిమినల్ ఫిర్యాదులను అత్యంత అరుదుగా రద్దు చేయడం జరుగుతుందని పేర్కొంది.

అయితే హైకోర్టు ఇలాంటి విషయాల్లో క్షుణ్ణంగా వ్యవహరించాలని పేర్కొంది. 2013లో ఓ ఫాం యజమాని డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ చట్టాన్ని ఉల్లంఘించడాని డ్రగ్స్ ఇన్స్‌పెక్టర్ గుర్తించారు. దీనిపై 2016‌లో షోకాజ్ నోటీసులు జారీ చేయగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు జవాబు ఇచ్చారు. అయితే వారిపై మరుసటి ఏడాదే కేసు నమోదు చేశారు. కేసులో అలసత్వం వహించారని కొట్టివేయాలని సదరు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు అందుకు నిరాకరించడంతో అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా కేసును కొట్టివేయాలని పేర్కొంది.

Next Story

Most Viewed